భారతదేశం, మార్చి 31 -- తెలుగు టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర హీరోగా సినిమాలు చేస్తూనే.. కొన్ని చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రల్లోనూ నటిస్తున్నారు. మొదటి నుంచి హీరోగా కాస్త డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు నవీన్. 2023లో మంత్ ఆఫ్ మధు చిత్రంలో ఎమోషనల్ క్యారెక్టర్ చేసి ప్రశంసలు దక్కించుకున్నారు. గతేడాది కాజల్ అగర్వాల్‍తో సత్యభామ మూవీ చేశారు. 2024లోనే ఇన్‍స్పెక్టర్ రిషి, స్నేక్స్ అండే లాడర్స్ వెబ్ సిరీస్‍ల్లో అదరగొట్టారు. ఇప్పుడు వరుసగా థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు నవీన్ చంద్ర. ఆ మూడు సినిమాలు ఏవంటే..

నవీన్ చంద్ర, పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో 'షో టైమ్' మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రీసెంట్‍గా వచ్చింది. పోలీస్ తలుపు వద్ద నిలబడగా.. త భార్య, కూతురుకు రక్షణగా నవీన్ చంద్ర చేయి అడ్డుపెట్టినట్టుగా ఈ ప...