Hyderabad, ఏప్రిల్ 7 -- Naveen Chandra About 28 Degree Celsius OTT Offers: ఓటీటీ వెబ్ సిరీస్‌లు, సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు హీరో నవీన్ చంద్ర. అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర ఆ తర్వాత కీలక పాత్రలు, విలన్ రోల్స్‌తో మెప్పించాడు. ఇన్‌స్పెక్టర్ రిషి వంటి హారర్, క్రైమ్ థ్రిల్లర్, పరంపర సిరీస్‌లతో మరింత పేరు తెచ్చుకున్నాడు నవీన్ చంద్ర.

డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో అలరించే నవీన్ చంద్ర నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ 28 డిగ్రీ సెల్సియస్. అందాల రాక్షసి తర్వాత నవీన్ చంద్ర హీరోగా నటించిన సినిమా ఇది. దీనికి పొలిమేర డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. పొలిమేర కంటే ముందు మొదటిసారి డాక్టర్ అనిల్ విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన సినిమా 28 డిగ్రీ సెల్సియస్.

వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై యంగ్ ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మి...