Hyderabad, ఏప్రిల్ 7 -- వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, అధిక చెమట వల్ల చర్మానికి అనేక రకాల నష్టాలు జరుగుతాయి. ఈ సమయంలో ఉపయోగించే హెవీ కెమికల్ ఆధారిత ఉత్పత్తులు కొన్నిసార్లు అలెర్జీ వంటి అనేక సమస్యలను కలిగిస్తాయి. అలోవేరా, దోసకాయ, రోజ్ వాటర్, ముల్తాన్ని మట్టి వంటి సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించడం ద్వారా వేసవిలో చర్మ సమస్యలు చూసుకోగలం. వేడి వాతావరణానికి అనుగుణంగా సహజమైన పరిష్కారాలతో మృదువైన, కాంతివంతమైన చర్మాన్ని పొందడానికి ఇలా చేయండి.

చర్మంపై కలిగే చెమటతో పాటు వాటి వల్ల పేరుకుపోయే మురికి, అదనపు నూనెను తొలగించడానికి సున్నితమైన క్లెన్సర్లను ఉపయోగించండి.

ఎండ తగలడం కారణంగా, గాయాల కారణంగా చర్మంపై ఏర్పడిన మృతకణాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. అలా చేయడం వల్ల చర్మంపై రంధ్రాలు మూసుకుపోకుండా, చర్మం కాంతిని కోల్పోకుండా ఉంటుంది.

వేసవిలో కూడా, మీ చర్మం...