Hyderabad, జనవరి 24 -- భారతీయ సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లను వెలుగులోకి తీసుకురావడానికి జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటారు. ఆడపిల్ల ఇంట్లో పుడితే ఒకప్పుడు ఆనందించే వారు కాదు, మూతి ముడుచుకుని పక్కకి వెళ్లిపోయారు. చూసేందుకు కూడా ఇష్టపడని సమాజం ఉండేది. ఇప్పుడు కాలం మారుతూ వస్తోంది. ఆడపిల్లలు కూడా చదువులో, ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. వారు కూడా మగవారితో సమానంగా పనిచేయగలుగుతున్నారు. వారికి కావాల్సిందల్లా కాసింత మద్దతు. ఆ మద్దతును తొలిగా ఇవ్వాల్సింది తల్లిదండ్రులే. కొడుకుతో సమానంగా కూతురుని చదివించి ఉద్యోగానికి పంపించే తల్లిదండ్రులనే ఇప్పుడు ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. కానీ ఇప్పటికీ ఆడపిల్లల్ని చదివిస్తున్నా ఉద్యోగానికి పంపకుండా పెళ్లి చేసే తల్లిదండ్రులు ఇంకా ఉన్నారు. ఆడపిల్ల కేవలం పెళ్లి కోసమే పుట్టినట్ట భావించక...