భారతదేశం, జనవరి 27 -- National Games: ఉత్తరాఖండ్‌లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరగనున్న 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌ జట్లకు ఏపీ ఒలంపిక్ అసోసియేషన్‌ ప్రాతినిథ్యం వహించాలని ఏపీ హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. రాష్ట్రం నుంచి క్రీడాకారులను పంపే విష యంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియే షన్ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్), ఏపీ ఆర్చరీ, ఏపీ అథ్లెటిక్, ఏపీ జూడో, ఏపీ ఖోఖో, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లకు హైకోర్టు ఆదేశించింది.

మరోవైపు కోర్టు తీర్పు తర్వాత కూడా శాప్‌ నుంచి తమకు ఎలాంటి సహకారం, సమాచారం అందలేదని, శాప్ ప్రతినిధులు కూడా జాతీయ క్రీడలకు హాజరవుతున్నారనే సమాచరం లేదని ఏపీ ఒలంపిక్ అసోసియేషన్‌ చెబుతోంది. తొలి రోజు ప్రధాని ఎదుట క్రీడాకారుల కవాతులో శాప్‌ లోగో, ఏపీ లోగో లేకుండా నిరసన తెలియ చేస్తామని...