భారతదేశం, జనవరి 29 -- National Games: ప్రధాని సమక్షంలో జరిగిన 38వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవంలో ఆంధ్రప్రదేశ్‌ క్రీడా జట్లు శాప్‌, ఏపీ ప్రభుత్వ లోగో లేకుండానే పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, శాప్‌ నుంచి చివరి నిమిషం వరకు క్రీడాకారులకు సహకారం అందించక పోవడం, ఉద్దేశపూర్వకంగా వివాదాలు సృష్టించడంతో ఏపీ ఒలంపిక్ సంఘం రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపింది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్లో 38వ జాతీయ క్రీడలను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు.

బాబా కేదార్ నాథ్, బద్రీనాథ్, మా గంగ ఆశీస్సులతో 38వ జాతీయ క్రీడలు ఈ రోజు ప్రారంభమయ్యాయని, ఉత్తరాఖండ్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జాతీయ క్రీడల్ని ఆ రాష్ట్రంలో నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. యువ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉన్న యువత తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందని మోదీ పేర్కొన్న...