భారతదేశం, మార్చి 26 -- Narayana New Campuses : ఆసియాలో అతిపెద్ద విద్యాసంస్థల్లో ఒకటైన నారాయణ విద్యాసంస్థలు...12 రాష్ట్రాలలో 52 కొత్త క్యాంపస్‌లను ప్రారంభించింది. ఈ మేరకు నారాయణ విద్యాసంస్థలు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. నాణ్యమైన విద్యను అందించడంలో నారాయణ మరో ముందడుగు వేసినట్లు వెల్లడించింది. తాజా క్యాంపస్ లతో ... దేశంలోని 23 రాష్ట్రాలలో స్కూళ్లు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు అన్నీ కలిపి మొత్తం 907 క్యాంపస్‌లకు చేరాయని పేర్కొంది.

ప్రతి విద్యార్థి సమగ్ర అభివృద్ధిని కాక్షింస్తూ నారాయణ తన నిర్మాణాత్మక పాఠ్యాంశాలు, అధునాతన బోధనా పద్ధతులు, శారీరక, మానసిక శ్రేయస్సుపై దృష్టిని పెడుతుందని తెలిపింది. ఈ విస్తరణతో భారతదేశ విద్యా వ్యవస్థను పునర్నిర్వచించడానికి, విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలను సాధించడానికి సాధికారత కల్పించడానికి ఉపయోగప...