భారతదేశం, జనవరి 27 -- Nara Lokesh Yuvagalam: అభద్రతాభావం, నిరాశ,నిస్పృహలతో కొట్టు మిట్టాడుతున్న టీడీపీ శ్రేణులకు నేనున్నానంటూ నారా లోకేష్ రెండేళ్ల క్రితం యువగళం పాదయాత్రలో జనంలోకి వెళ్లారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో97 అసెంబ్లీ నియోజకవర్గాలు,232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3132 కి.మీ.ల మేర యువగళం పాదయాత్ర సాగింది. ప్రజల కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ సాగిన యువగళం పాదయాత్ర 2023 సెప్టెంబర్‌‌లో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయ్యే వరకు ఏకబిగిన కొనసాగింది. పండుగలు, సెలవులు లేకుండా ఏకబిగిన పాదయాత్రను కొనసాగించారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వాన్ని ఓడించడంలో యువగళం కీలకపాత్ర పోషించింది.

యువగళం సాగిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. పార్టీ అధినేత చ...