భారతదేశం, ఫిబ్రవరి 21 -- Nara Lokesh On Group 2 : ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఈ నెల 23న మెయిన్స్ నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండగా...రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహించొద్దని గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళనలు చేస్తు్న్నారు. విశాఖతో పాటు పలు పట్టణాల్లో గ్రూప్-2 అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. గ్రూప్ 2 అభ్యర్థుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

"గ్రూప్ 2 అభ్యర్థుల నుంచి గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయమని నాకు చాలా అభ్యర్థనలు వచ్చాయి. వారి ఆందోళనలను నేను అర్థం చేసుకున్నాను. మా లీగల్ టీమ్ లతో సంప్రదించి, పరిష్కారం కనుగొనడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తాను" అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.

ఏపీపీఎస్సీ గ్రూప్- 2 మెయిన్స్‌ పరీక...