భారతదేశం, ఏప్రిల్ 7 -- Nara Lokesh: మంగళగిరి ప్రజలను నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటా, భారతదేశంలో నెం.1 నియోజకవర్గంగా మంగళగిరిని చేసే బాధ్యత నేను తీసుకుంటానని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మనఇల్లు - మనలోకేష్ కార్యక్రమంలో భాగంగా 3వరోజు యర్రబాలెం డాన్ బాస్కో స్కూలు ఆవరణలో తాడేపల్లి మండలం కొలనుకొండకు చెందిన 231మందికి, పద్మశాలి బజార్ కి చెందిన 127మంది పేదలకు పట్టాలను అందజేశారు.

2019 ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల్లో మీ ముందు నిలబెడ్డానని, నియోజకవర్గంపై పెద్దగా అవగాహన లేకపోవడం, మీ సమస్యలు తెలుసుకోలేకపోవడం, కేవలం ఎన్నికలకు 21రోజుల ముందు రావడంతో 5300 ఓట్ల తేడాతో ఓడిపోయానని లబ్దిదారులకు నారా లోకేష్‌ చెప్పారు. ఓడినరోజు కొంచెం బాధ పడ్డా రెండోరోజు నుంచి నాలో కసి పెరిగిందన్నారు. మంగళగిరి ప్రజలకు సేవ చేయాలని...