భారతదేశం, మార్చి 2 -- సినీ హీరోల అభిమానుల మధ్య ఇటీవలి కాలంలో ఫ్యాన్ వార్స్ ఎక్కువుతున్నాయి. సోషల్ మీడియాలో కొందరు హీరోల అభిమానుల మధ్య తరచూ యుద్ధం జరుగుతోంది. తమ హీరోపై విమర్శలు వస్తే.. అదే రేంజ్‍లో ఫ్యాన్స్ బదులిస్తున్నారు. ట్రోలింగ్ కూడా ఎక్కువుతోంది. ఇలా ఫ్యాన్ వార్ ట్రెండ్ నడుస్తోంది. అయితే, తాజాగా టాలీవుడ్ హీరోలు నాని, విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఓ యూట్యూబర్ కామెంట్లతో ఈ చిచ్చు షురూ అయింది.

టాలీవుడ్ టైర్-2 హీరో ఒకరు.. పీఆర్ టీమ్ ద్వారా మరో హీరోపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారంటూ తన రాగడి యూట్యూబ్ ఛానెల్‍లో అనిల్ అనే యూట్యూబర్ కామెంట్లు చేశారు. మూడేళ్ల నుంచి ఓ హీరోపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోందని, దీని వెనుక మరో హీరో ఉన్నారనేలా వివాదాస్పద ఆరోపణలు చేశారు. హీరోల పేర్లు చెప్పకుండానే.. ఈ కామెంట్లు చేశారు. ...