భారతదేశం, మార్చి 7 -- వరుసగా హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న నాని ప్రోడ్యూసర్ గానూ మెప్పిస్తున్నాడు. తన వాల్ పోస్టర్స్ బ్యానర్ పై విభిన్నమైన కథాంశాలతో కూడిన సినిమాలను అందిస్తున్నాడు. తాజాగా కోర్ట్ మూవీతో మరోసారి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అనేది క్యాప్షన్. ప్రియదర్శి మెయిన్ లీడ్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం (మార్చి 7) రిలీజైంది.

టీనేజీ లవ్ తో మొదలై కోర్టు చూట్టూ ఈ సినిమా తిరిగేలా కనిపిస్తోంది. ఇద్దరు టీనేజర్లు ప్రేమించుకుంటే.. ఆ అమ్మాయి తండ్రి అబ్బాయిపై రకరకాల సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయిస్తాడు. తప్పు చేకపోయినా అక్రమంగా ఇరికించినట్లు కోర్ట్ సినిమా ట్రైలర్ లో కనిపిస్తోంది. చివరకు అత్యంత సెన్సిటివ్ అయిన పోక్సో కేసు కూడా పెట్టినట్లు చూపించారు.

కోర్టు సినిమాలో ప్రియదర్శి లాయ...