Hyderabad, ఏప్రిల్ 14 -- Nani on HIT 3: ఈ మధ్య సినిమాల్లో వయోలెన్స్ మరీ ఎక్కువైపోతోంది. యానిమల్, మార్కోలాంటి మూవీస్ ఎలా ఉన్నాయో మనం చూశాం. తాజాగా నాని నటించిన హిట్ 3 మూవీ ట్రైలర్ సోమవారం (ఏప్రిల్ 14) రిలీజ్ కాగా.. ఇందులోనూ మితిమీరిన హింస ఉన్నట్లుగా అనిపించింది. అయితే దీనిపై నాని స్పందించాడు. మన బుద్ధి బాగుండాలని, ఇంతకంటే వయోలెంట్ మూవీస్ తీసిన దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువగా ఉందని అతడు చెప్పడం విశేషం.

హిట్ 3 మూవీ మే 1న థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను సోమవారం (ఏప్రిల్ 14) వైజాగ్ లో లాంచ్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో నాని మాట్లాడాడు. "ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి నా ఫోన్ మెసేజ్ లతో ఫుల్ అయింది. ట్రైలర్ కి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ ఇది.

చాలా ఆనందాన్నిచ్చి...