Hyderabad, ఫిబ్రవరి 15 -- Nani Comments On Dhanraj Ramam Raghavam In Trailer Launch: జబర్దస్త్ కామెడీ షోతో కమెడియన్‌గా పాపులారిటీ తెచ్చుకున్నాడు ధన్‌రాజ్. నటుడిగా సినీ కెరీర్ ప్రారంభించిన ధన్‌రాజ్ ఇప్పుడు దర్శకుడిగా మారాడు. ధన్‌రాజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రామం రాఘవం.

స్లేట్‌ పెన్సిల్‌ స్టోరీస్‌ పతాకంపై ప్రభాకర్‌ అరిపాక సమర్పణలో పృథ్వీ పోలవరపు నిర్మాతగా వ్యవహరించిన ద్విభాషా చిత్రమే రామం రాఘవం. ఇందులో సముద్రఖని ప్రధానపాత్రలో నటించాడు. తాజాగా రామం రాఘవం మూవీ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశాడు. రామం రాఘవం ట్రైలర్ లాంచ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

హీరో నాని మాట్లాడుతూ.. "రామం రాఘవం ట్రైలర్‌ను నా చేతులమీదుగా విడుదల చేయటం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ధన్‌రాజ్‌ నాకు కెరీర్‌ మొదటి నుంచి పరిచయం. ...