భారతదేశం, మార్చి 21 -- ఈ ఘ‌ట‌న నంద్యాల జిల్లా ప్యాపిలి మండ‌లం ఒక గ్రామంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో జరిగింది. విద్యార్థినుల త‌ల్లిదండ్రులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పాఠ‌శాల‌లో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా ఎం.బొజ్జ‌న్న ప‌ని చేస్తున్నాడు. ఆయ‌న పాఠ‌శాల‌లోని విద్యార్థినుల‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్నాడు. క్లాస్ రూమ్‌లోనూ, బ‌య‌ట క‌నిపించిన‌ప్పుడు విద్యార్థినుల‌ను పిలిచి అశ్లీల చిత్రాల‌ను చూపించి వ‌ల్గ‌ర్‌గా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ తాకేవాడు. వీడియోలు చూసేందుకు విముఖ‌తం వ్య‌క్తం చేసిన విద్యార్థినుల‌ను తిట్ట‌డం, కొట్ట‌డం చేసేవాడు.

స‌ర‌స్వ‌తి పూజ రోజు కూడా ఇలాగే ప్ర‌వ‌ర్తించాడు. రెండేళ్ల నుంచి ఇలా అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తూ.. విద్యార్థినుల‌ను దూషిస్తున్నాడు. విద్యార్థులు బ‌య‌ట‌కు చెప్పుకోలేక త‌మ‌లోతామే కుమి...