భారతదేశం, జనవరి 28 -- Nandyal Accident : నంద్యాల జిల్లాల‌లో తీవ్ర విషాదం నెల‌కొంది. గ్యాస్ సిలిండ‌ర్ పేలి ఏకంగా ఇల్లు కుప్పకూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు అక్కడిక‌క్కడే మృతి చెంద‌గా, తొమ్మిది మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్యలు చేప‌ట్టారు. క్షత‌గాత్రుల‌ను వైద్యం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మృతదేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

నంద్యాల మండ‌లం చాపిరేవు గ్రామంలో మంగ‌ళ‌వారం తెల్లవారుజామున‌ ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాల ప్రకారం చాపిరేవుకు చెందిన వెంక‌ట‌మ్మ (70) ఇంటికి అదే జిల్లాకు చెందిన బేతంచ‌ర్ల మండ‌లం పెండేక‌ల్లు గ్రామానికి చెందిన బంధువులు సుబ్బమ్మ, రాముడు సోమ‌వారం రాత్రి వ‌చ్చారు. వారికి రాత్రి భోజ...