భారతదేశం, ఫిబ్రవరి 18 -- నమో డ్రోన్ దీదీ పథకం.. దేశంలోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వినూత్న కార్యక్రమం. ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తారు. మహిళలకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని.. వరంగల్ జిల్లాకు చెందిన మహిళ సద్వినియోగం చేసుకున్నారు. స్వయం ఉపాధికి బాటలు వేసుకున్నారు.

మెడిద వకులది వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేట గ్రామం. నమో డ్రోన్ దీదీ పథకంలో భాగంగా.. పైలట్ శిక్షణ పొందారు వకుల. శిక్షణ అనంతరం.. రూ.8 లక్షల విలువైన అత్యాధునిక డ్రోన్, ఇఫ్కో ద్వారా రూ.5.50 లక్షల విలువైన ఆటో, బ్యాటరీల ఛార్జింగ్ కోసం రూ.2.80 లక్షల విలువైన జనరేటర్‌ను వకుల ఉచితంగా పొందార...