Saleshwaram,telangana, ఏప్రిల్ 11 -- సలేశ్వరం.. నల్లమల కొండల్లో కొలువైన లింగమయ్య క్షేత్రం. తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్రగా పేరు గాంచింది. ఇక్కడ కొలువుదీరిన సళేశ్వరుడిని దర్శించుకోవాలంటే పెద్ద యాత్ర చేయాల్సిందే. కర్రల సాయంతో లోయలోకి నడుచుకుంటా వెళ్తే గానీ.. ఆ లింగయ్య దర్శనం దొరకదు. ప్రతి ఏడాది మూడు రోజల పాటు ఇక్కడ ఉత్సవాలు(జాతర) జరుగుతున్నాయి. ఇందుకోసం భక్తులు భారీగా తరలివస్తారు.

ఎంతో సాహోసోపేతమైన యాత్రగా పేరొందిన సలేశ్వరం జాతర ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. ఏటా చైత్ర పూర్ణిమ నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 13 వరకు నిర్వహించనున్న ఈ యాత్రకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయటంతో పాటు తొక్కిసలాట వంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని నల్లమల అడవుల్...