తెలంగాణ,నల్గొండ, జనవరి 17 -- నల్గొండ జిల్లా కలెక్టర్‌ త్రిపాఠి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 100 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ ను బ్రేక్ చేశారు. నెలల తరబడి విధులకు గైర్హాజరు కావడంతో కలెక్టర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.

నల్గొండ జిల్లా పరిధిలో పని చేస్తున్న పలువురు పంచాయతీ కార్యదర్శులు విధులకు హాజరుకావటం లేదు. ఇదే విషయం కలెక్టర్ దృష్టికి చేరింది. రంగంలోకి దిగిన కలెక్టర్ విచారణ చేపట్టారు. అయితే 100 మంది పంచాతీయ కార్యదర్శులు. విధులకు హాజరుకావటం లేదని గుర్తించారు. వీరంతా కూడా గతేడాది జనవరి నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఆఫీసులకు రానట్లుగా తేలింది.

ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే వీరంతా కూడా డుమ్మా కొట్టనట్లు విచారణలో గుర్తించారు. దీంతో కఠిన చర్యలకు సిద్ధమైన జిల్లా కలెక్టర్. సంబంధిత కలెక్టర్లపై చర్యలు త...