భారతదేశం, ఫిబ్రవరి 9 -- ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులో రూ.23 లక్షల బ్యాగ్ మాయమైంది. నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి వద్ద బస్సులో రూ.23లక్షల నగదుతో ఉన్న బ్యాగ్ చోరీ కలకలం రేపింది. ఆదివారం ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును.. టిఫిన్‌ చేసేందుకు నార్కెట్‌పల్లి సమీపంలోని ఓ హోటల్‌ వద్ద ఆపారు.

అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి నగదు బ్యాగ్‌ను బస్సులో ఉంచి.. టిఫిన్‌ చేసేందుకు దిగారు. తిరిగి వచ్చి చూసి నగదు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే బస్సులో ప్రయాణించిన వారే చోరీ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణించే వారికి శుభవార్త ఇది. కేవలం 99 రూపాయలతో సౌకర్యవంతంగా హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకునే ఏర్పాట్లు చేశారు. ఈ రెండు...