భారతదేశం, మార్చి 10 -- ప్రణయ్ హత్య.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ పరువు హత్య కేసుకు సంబంధించి ఇవాళ తుది తీర్పు వెలువడనుంది. నల్గొండ జిల్లాలో అమృత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు.. ప్రణయ్ అనే యువకుడిని అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకుల ముఠాతో దారుణంగా హత్య చేయించారు. 2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ఈ పరువు హత్య కేసు తీవ్ర సంచలనంగా మారింది.

ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. మారుతీరావుతో సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతోనే ఆమె తండ్రి మారుతీ రావు సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడని పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి 2019 జూన్ 12న 1600 పేజీలతో ఛార్జి...