భారతదేశం, మార్చి 19 -- Nagpur clashes: మార్చి 17న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్ నేపథ్యంలో నాగ్ పూర్ నగరంలో చెలరేగిన మత ఘర్షణల వెనుక సూత్రధారి ఫహీమ్ షమీమ్ ఖాన్ అని పోలీసులు తేల్చారు. అతడిని ప్రధాన నిందితుడుగా నిర్ధారించి, బుధవారం అరెస్ట్ చేశారు.

ఈ అల్లర్లకు సంబంధించి 50 మందిని అదుపులోకి తీసుకున్నామని, నాగ్ పూర్ లోని పది పోలీసు జిల్లా ప్రాంతాల్లో వరుసగా రెండో రోజు కర్ఫ్యూ అమల్లో ఉందని పోలీసులు తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందని డీసీపీ రాహుల్ మక్నికర్ తెలిపారు. 'దర్యాప్తు కొనసాగుతోంది. 10 బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు 50 మందిని అదుపులోకి తీసుకున్నాం' అని తెలిపారు. నాగ్ పూర్ అల్లర్ల కేసులో 19 మంది నిందితులకు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఈ నెల 21 వరకు పోలీసు కస్టడీ విధించింది.

38 ఏళ్ల ఫహీమ్ షమీమ్...