భారతదేశం, జనవరి 28 -- గోండుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక నాగోబా జాతర. ఆదివాసీ, గిరిజనులు ఈ జాతరను ఘనంగా జరుపుకుంటారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ వేదికగా జరిగే నాగోబా జాతర ఇవాళ (జనవరి 28, మంగళవారం నాడు) ప్రారంభం కానుంది. ఏటా వైభవంగా నిర్వహించే ఈ జాతరకు తెలంగాణ తోపాటు.. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తారు.

ఏటా పుష్య మాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మహా పూజలతో మెస్రం వంశస్థులు ఈ జాతరను ప్రారంభిస్తారు. ఈనెల 2వ తేదీన నాగోబా మహా పూజలకు నెలవంకతో శ్రీకారంచుట్టారు. 10వ తేదీన నాగోబా మహా పూజలకు అవసరమయ్యే పవిత్ర గంగాజలం కోసం పాదయాత్ర చేపట్టారు. ఈనెల 17వ తేదీన మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం కలమడుగు శివారుకు చేరుకున్నారు. అక్కడ గోదావరిలోని హస్తిన మడుగు నుంచి పవిత్ర గంగాజలం సేకరించారు.

మహా పూజలకు నాలుగు రోజుల ముందు ఆలయ పరిసరాల్లోని ...