భారతదేశం, జనవరి 28 -- Nagoba Jatara: ఆదివాసీ నాగోబా జాతర ప్రారంభమైంది. మెస్రం వంశీయులు కాలినడకన గోదావరి హస్తినమడుగు నుంచి సేకరించిన గంగా జలంతో మర్రిచెట్టు వద్దకు చేరుకున్నారు. ఇక్కడ పీఠాధిపతి వెంకట్రావ్కు ఆహ్వానం పలికారు. పూజకు ఒక రోజు ముందు తూమ్ పూజలను నిర్వహించారు.

మర్రిచెట్టు వద్ద వివిధ సాంప్రదాయ పూజలు చేసిన మెస్రం వంశీయులు పూజ మంగళవారం రోజున డోలు, పెప్రే, కాళికొమ్ వాయిస్తూ నాగోబా ఆలయానికి వస్తున్నారు, నాగోబా ఆలయం పక్కనే ఉన్న గోవాడ్ (ప్రత్యేక కట్టడం) వద్దకు తీసుకెళ్లి బస చేస్తారు. ముందుగా మర్రిచెట్టు వద్ద ఉన్న పవిత్ర కోనేరు నుంచి మట్టి కుండల్లో మెస్రం వంశం అల్లుండ్లు నీరు తోడుతారు. ఆడపడుచులు ఆ నీటిని ఆలయం ప్రాంగణంలోకి తీసుకువెళ్తారు. అదే నీటితో ఆలయం పక్కనే ఉన్న పాత మట్టి పుట్టను అల్లుండ్లు తవ్వుతారు. ఆడపడుచులు అదే మట్టితో కొత్త పుట్టన...