భారతదేశం, ఏప్రిల్ 1 -- రివ్యూవ‌ర్స్‌తో పాటు సోష‌ల్ మీడియాలో మ్యాడ్ స్క్వేర్ మూవీపై నెగెటివ్ కామెంట్స్ చేస్తోన్న వారిపై నిర్మాత నాగ‌వంశీ ఫైర్ అయ్యారు. కంటెంట్ లేక‌పోయినా సీక్వెల్ కాబ‌ట్టి ఆడుతోంద‌ని కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని, ఎలా ఉన్నా చూడ‌టానికి ఇదేం పుష్ప 2, బాహుబ‌లి 2, కేజీఎఫ్ 2 కాద‌ని నాగ‌వంశీ అన్నారు. మ్యాడ్‌2పై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌పై మంగ‌ళ‌వారం ఏర్పాటుచేసిన పాత్రికేయుల స‌మావేశంలో నాగ‌వంశీ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.

నాగ‌వంశీ మాట్లాడుతూ మ్యాడ్ 2 థియేట‌ర్ల‌లో బాగా ఆడుతోంది. సినిమా ఆడుతుంద‌నే నిజాన్ని కొంద‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ సినిమాలో వంక‌లు వెతుకుతున్నారు. ఈ సినిమాకు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఫేక్ అని ప్ర‌చారం చేస్తోన్నారు. క‌లెక్ష‌న్స్ విష‌యంలో ఎవ‌రికి డౌట్ ఉన్నా చూపిస్తా. నేను ఫేక్ క‌లెక్ష‌న్స్ చెప్పాన‌ని ప్రూవ్ చేయ‌...