Hyderabad, ఫిబ్రవరి 7 -- Nagarjuna Meets PM Modi: అక్కినేని నాగార్జున తన కుటుంబంతో కలిసి శుక్రవారం (ఫిబ్రవరి 7) ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఓవైపు నాగ చైతన్య నటించిన తండేల్ మూవీ ఇదే రోజు రిలీజ్ కాగా.. అతడు మాత్రం ఢిల్లీలో బిజీగా గడిపాడు. నాగార్జునతోపాటు భార్య అమల, నాగ చైతన్య, అతని భార్య శోభితా ధూళిపాళ్ల ఉన్నారు. మోదీని నాగార్జున ఫ్యామిలీ కలిసి ఫొటోను ఎంపీ బైరెడ్డి శబరి ఎక్స్ లో పోస్ట్ చేశారు.

నాగార్జున కుటుంబం ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఎంపీ బైరెడ్డి శబరి వాళ్లతో కలిసి దిగిన ఫొటోను ఎక్స్ లో షేర్ చేశారు. పార్లమెంట్ ఆవరణలోని టీడీపీ ఆఫీసులో నాగార్జున కుటుంబాన్ని కలిసినట్లు ఆమె ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ప్రధాని మోదీని నాగార్జున కుటుంబం కలవడం వెనుక కారణమేంటన్నది మాత్రం ఆమె వెల్లడించలేదు.

అయితే మోదీని కలిసి ఆయనకు అక్కినేని నాగేశ్వర రావు పు...