Hyderabad, ఫిబ్రవరి 11 -- Nagarjuna: తండేల్ మూవీ సక్సెస్ మీట్ లవ్ సునామీ పేరుతో హైదరాబాద్ లో మంగళవారం (ఫిబ్రవరి 11) జరిగింది. ఈ ఈవెంట్ కు నాగార్జున స్పెషల్ గెస్టుగా రాగా.. మూవీ టీమ్ నాగ చైతన్య, చందూ మొండేటితోపాటు చైతూ భార్య శోభితా ధూళిపాళ్ల కూడా వచ్చింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. 2025లో ఇది ముహూర్తం మాత్రమే.. వస్తున్నాం.. కొడుతున్నాం అని అనడం గమనార్హం.

తండేల్ సక్సెస్ మీట్ లో నాగార్జున మాట్లాడాడు. ఈ సందర్భంగా తన తనయుడు నాగ చైతన్య నటనపై ప్రశంసల వర్షం కురిపించాడు. తన కొడుకు కాబట్టి పొగడకూడదు అంటూనే.. ఈ సినిమాలో చైతన్య నటన చూస్తుంటే తనకు తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గుర్తొచ్చారని అనడం విశేషం.

సినిమా చాలా బాగుందని, క్లైమ్యాక్స్ అద్భుతంగా తీశావంటూ డైరెక్టర్ చందూ మొండేటిని ప్రశంసించాడు. అయితే 2025లో ఇది కేవలం ముహూర్తమే అని, వస్తు...