భారతదేశం, ఏప్రిల్ 16 -- టాలీవుడ్‌లో కొత్త ద‌ర్శ‌కుల‌ను, ప్ర‌యోగాల‌ను ప్రోత్స‌హించ‌డంలో ముందు వ‌రుస‌లో నిలుస్తుంటారు హీరో అక్కినేని నాగార్జున‌. సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో యాభై మందికిపైగా ద‌ర్శ‌కుల‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారు నాగార్జున‌. నాలుగు ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణంలో అన్ని జాన‌ర్స్‌లో సినిమాలు చేశారు.

1986లో రిలీజైన విక్ర‌మ్ సినిమాతో నాగార్జున సినీ ప్ర‌యాణం మొద‌లైంది. బాలీవుడ్‌లో విజ‌య‌వంత‌మైన హీరో మూవీ ఆధారంగా విక్ర‌మ్ తెర‌కెక్కింది. నాగార్జున డెబ్యూ మూవీకి ఆయ‌న సోద‌రుడు అక్కినేని వెంక‌ట్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. వి మ‌ధుసూద‌న‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాతోనే శోభ‌న హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. విక్ర‌మ్ మూవీ థియేట‌ర్ల‌లో వంద రోజుల‌కుపైగా ఆడింది.

నాగార్జున డెబ్యూ మూవీ కోసం విక్ర‌మ్ కంటే ముందు మ‌రో క‌థ‌ను అనుకున్న...