భారతదేశం, ఫిబ్రవరి 2 -- Nagababu : పుంగనూరు ప్రజలను మోసగిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు డిమాండ్ చేశారు. జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పుంగనూరులో పర్యటించిన ఆయన...వైసీపీపై విమర్శలు చేశారు. వైసీపీ నాయకులు కళ్లు మూసుకుని నిద్రపోతున్నట్టు నటిస్తున్నారన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా నోరు జారి... ఇప్పుడు కుంటి సాకులు చెబుతున్నారన్నారు. సామాజిక మాధ్యమాల్లో, ఇళ్లల్లో కూర్చొని కాదు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు. ఖనిజాలను దోచుకునే మాఫియా అంతు చూస్తానని ప్రధాని మోదీ కలికిరిలో చేసిన ప్రకటన త్వరలోనే అమలవుతుందని అన్నారు.

"పెద్దిరెడ్డి తాను దోచుకున్న భూముల రికార్డులు లేకుండా తన అనుచరులతో మదనపల్లి తహసీల్దారు కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించారు. తగలబడిన ఫైల్స్...