Hyderabad, మార్చి 9 -- Nagababu About Pawan Kalyan And Chiranjeevi: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగా కుటుంబంతో ఇంటర్వ్యూ నిర్వహించారు. మెగా ఉమెన్స్ డే ఇంటర్వ్యూలో నాగబాబు ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చారు. ఆయనతోపాటు నాగబాబు తల్లి అంజనా దేవి, మెగా సిస్టర్స్ విజయ దుర్గ, మాధవి పలు విషయాలు పంచుకున్నారు.

నాగబాబు మాట్లాడుతూ .. "చిన్నతనంలో నేను ఎక్కువగా పని చేసేవాడిని కాదు. అన్ని పనులు అన్నయ్యే చేసేవారు. నాకు చెప్పిన పనుల్ని కూడా అన్నయ్యకే ఇచ్చేవాడిని. అలా అప్పుడప్పుడు అన్నయ్య చేతిలో నాకు దెబ్బలు కూడా పడ్డాయి (నవ్వుతూ)" అని అన్నారు.

"చిన్నప్పుడు మా తమ్ముడు కల్యాణ్ బాబు (పవన్ కల్యాణ్) చాలా వీక్‌గా ఉండేవాడు. అందుకే మా అమ్మ కళ్యాణ్ బాబు మీద ఎక్కువ కేరింగ్‌గా ఉండేవారు. ఇప్పటికీ కళ్యాణ్ బాబు వస్తున్నాడంటే ఇష్టమైన వంటకాలన్నీ వ...