Hyderabad, మార్చి 26 -- Naga Vamsi on Nepotism: టాలీవుడ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ మరోసారి నోరు జారి విమర్శల పాలవుతున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అసలు నెపోజిటమే(బంధుప్రీతి) లేదని అతడు అనడం గమనార్హం. నందమూరి, అక్కినేని, కొణిదెల, ఘట్టమనేనిలాంటి వంశాలు ఎన్నో దశాబ్దాలుగా తెలుగు తెరను ఏలుతున్నా నాగవంశీ చేసిన ఈ కామెంట్స్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి.

బాలీవుడ్ లో నెపోటిజం సర్వసాధారణం. అక్కడి హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతల పిల్లలే ఇండస్ట్రీని ఏలుతున్నారు. సౌత్ ఇండస్ట్రీకి అందులోనూ టాలీవుడ్ లో కూడా ఇది సహజమే. కానీ ప్రొడ్యూసర్ నాగవంశీ వాదన మరోలా ఉంది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అతడు టాలీవుడ్ లో నెపోటిజమే లేదని స్పష్టం చేశాడు.

"తెలుగులో పెద్దగా నెపోటిజం లేదు. తమిళం గురించి తెలియదు. మలయాళం గురించి తెలియదు. నాకు తెలియని ఇతర భాషల గురించి నేను మాట్ల...