Hyderabad, మార్చి 21 -- Naga Chaitanya Sobhita: శోభిత ధూళిపాళ, నాగ చైతన్య ఒకరి గురించి మరొకరు కొన్ని ఆసక్తికర వివరాలను పంచుకున్నారు. ఇందులో వారి మధ్య సంబంధంలో ఎవరు మొదటి అడుగు వేశారు.. ఎవరు క్షమాపణలు చెబుతారు.. వారి వంట నైపుణ్యాలు, వారి వింత అలవాట్ల గురించి ఉండటం విశేషం. వోగ్ ఇండియా (Vogue India)తో మాట్లాడుతూ.. ఒకవేళ ప్రపంచ వినాశనం జరిగితే వారి మనుగడ నైపుణ్యాల గురించి కూడా శోభిత, నాగ చైతన్య మాట్లాడారు.

శోభిత, చైతన్య ఇంటర్వ్యూకు సంబంధించి వారి యూట్యూబ్ ఛానెల్‌లో.. వోగ్ ఒక వీడియోను పంచుకుంది. గొడవలు జరిగినప్పుడు మొదట ఎవరు సారీ చెబుతారన్న ప్రశ్నకు శోభిత స్పందిస్తూ.. తానే అని చెప్పింది. కానీ దీనికి చైతన్య కౌంటర్ ఇచ్చాడు.

ఆమె సారీలు, థాంక్యూలను నమ్మదని చైతన్య అనడం విశేషం. వారి వింత అలవాట్ల గురించి, వాటిలో ఏవి చూడటానికి ముద్దుగా అనిపిస్తాయో క...