Hyderabad, ఫిబ్రవరి 6 -- Naga Chaitanya About Is Thandel Creates 100% Love Movie Magic: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మరోసారి హీరో హీరోయిన్స్‌గా జోడీ కట్టిన సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా రూపొందిన ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించారు.

తండేల్ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా టీమ్ పలు ప్రమోషనల్ ఈవెంట్స్‌లలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే నిర్వహించిన విలేకరులు సమావేశంలో హీరో నాగ చైతన్య పాల్గొని వారు అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చాడు.

- నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రొడక్షన్, హై బడ్జెట్ మూవీ. క్యారెక్టర్, స్టొరీ అన్ని రకాలుగా బిగ్ స్పాన్ ఉన్న సినిమా ఇది. చాలా ఎగ్జయిట్‌మెంట్ ఉంది. ఆల్రెడీ సినిమా చూశాం. చాలా కాన్ఫిడెం...