Hyderabad, ఫిబ్రవరి 13 -- Naga Chaitanya: నాగ చైతన్య, సమంత పెళ్లి, విడాకుల వార్తలు రెండూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖంగా నిలిచిన సంగతి తెలుసు కదా. విడాకుల తర్వాత శోభితా ధూళిపాళ్లను పెళ్లి చేసుకున్న చైతన్య.. తాజాగా మరోసారి ఆ అంశంపై స్పందించాడు. సమంతతో విడాకుల విషయంలో శోభిత తప్పేమీ లేదని, అనవసరంగా ఆమెను అందులోకి లాగారని రా టాక్స్ విత్ వీకే పాడ్‌కాస్ట్ లో చెప్పాడు.

ఈ పాడ్‌కాస్ట్ లో సమంతతో విడాకులు, రెండో పెళ్లిపై తండేల్ స్టార్ నాగ చైతన్య స్పందించాడు. "నా కంటే ఎక్కువగా శోభిత గురించే ఫీలవుతాను. ఆమెను నిందించడం సరి కాదు. ఇందులో ఆమె తప్పేమీ లేదు. ఆమె నా జీవితంలో చాలా అందంగా వచ్చింది. సోషల్ మీడియాలో చాట్ చేసుకున్నాం.

క్యాజువల్ గా కలిశాం. ఫ్రెండ్స్ అయ్యాం. అక్కడి నుంచి రిలేషన్షిప్ మొదలైంది. నా గతంతో ఆమెకు అసలు ఎలాంటి సంబంధం లేదు. ఆమె గురించి...