Hyderabad, జనవరి 31 -- Naga Chaitanya: నాగ చైతన్య తన నెక్ట్స్ మూవీ తండేల్ తో ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలుసు కదా. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా హిందుస్థాన్ టైమ్స్ తో అతడు మాట్లాడాడు. కెరీర్లో తొలిసారి ఓ పూర్తి భిన్నమైన పాత్ర పోషిస్తున్న చైతన్య.. ఈ మూవీలో పని చేయడంతోపాటు శోభితతో పెళ్లి, ఇతర అంశాలపైనా స్పందించాడు.

నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల గతేడాది డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెతో పెళ్లి జీవితంపై అతడు హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో స్పందించాడు. "పెళ్లి తర్వాత జీవితం చాలా గొప్పగా ఉంది. నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. రెండు నెలలే అయింది. అయితే మేమిద్దరం ఒకరికొకరం తగినంత సమయం కేటాయిస్తున్నాం. అటు షూటింగులు, ఇటు వ్యక్తిగత జీవితానికి సమానంగా సమయం ఇస్తుండటంతో వర్క్ లైఫ్...