Hyderabad, జనవరి 30 -- Naga Chaitanya About Sobhita Dhulipala In Thandel Trailer Launch: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'తండేల్'. 'కార్తికేయ-2' లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

అలాగే, సక్సెస్‌ఫుల్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో చేస్తున్న చిత్ర యూనిట్ ఇటీవల తండేల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

వైజాగ్‌లోని రామా టాకీస్‌ రోడ్డులోని శ్రీరామ పిక్చర్ ప్యాలెస్‌లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో తండేల్ ట్రైలర్ లాంచ్ జరిగింది. అభిమానుల మధ్య ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈ వేడుకక...