భారతదేశం, ఫిబ్రవరి 8 -- హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత విడాకులు తీసుకొని సుమారు నాలుగేళ్లు అవుతుంది. శోభితా దూళిపాళ్లను గతేడాది వివాహం చేసుకున్నారు చైతూ. అయితే, నాగచైతన్య, సమంత విడాకుల విషయం అప్పటి నుంచి హాట్‍టాపిక్‍గానే ఉంది. ఇప్పటికీ ఈ అంశంపై సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ చర్చలు సాగుతూనే ఉంటాయి. ఈ విషయంపై నాగచైతన్య ఎమోషనల్ అయ్యారు. తండేల్ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంతతో విడిపోవడం గురించి చైతన్య మాట్లాడారు.

జీవిత భాగస్వామితో విడిపోవడం అనేది చాలా మంది జీవితాల్లో జరుగుతుందని, కానీ తనను ఎందుకు క్రిమినల్‍గా చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదని నాగచైతన్య అన్నారు. యూట్యూబ్ ఛానెల్ 'రా టాక్స్ విత్ వీకే'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ ఈ విషయంపై స్పందించారు.

తాను కూడా ఓ విడిపోయిన కుటుంబం నుంచే వచ్చానని, తనకు ఆ బాధ తెలుసంటూ ఎమ...