భారతదేశం, ఏప్రిల్ 15 -- డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పటి వరకు చేసినవి మూడు సినిమాలే అయినా టాప్ డైరెక్టర్ల జాబితాలోకి ఎక్కేశారు. ఎవడే సుబ్రమణ్యం, మహానటి, కల్కి 2898 ఏడీ చిత్రాలతో వరుస హిట్స్ కొట్టారు. గతేడాది ప్రభాస్‍తో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి బ్లాక్‍బస్టర్ అయింది. ఈ మూవీ సీక్వెల్ కల్కి 2 స్క్రిప్ట్ పనుల్లో నాగ్ అశ్విన్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. కాగా, తాజాగా ఓ ఇంటరాక్షన్‍లో నాగ్ అశ్విన్ పాల్గొన్నారు. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

కొందరు ఫిల్మ్ మేకర్లకు ఏదైనా రాసేటప్పుడు.. అలాంటి కాన్సెప్ట్, ఐడియాతోనే వేరే చిత్రాలు రావడం జరుగుతూ ఉంటుందని నాగ్ అశ్విన్ అన్నారు. మీకు ఏదైనా అలాంటిది ఎదురైందా అనే ప్రశ్నకు ఆయన స్పందించారు. ఇన్‍సెప్షన్ మూవీలోని ఐడియా తనకు ఆ చిత్రం రిలీజ్‍కు ముందే వచ్చిందని నాగ్ అశ్విన్ చెప్పారు.

తాను అనుకుంటు...