భారతదేశం, మార్చి 1 -- Nadendla Manohar : మార్చి 14న, పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జన సైనికుడు, వీరమహిళ తీసుకోవాలని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించిన అనంతరం జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో యావత్ దేశం చూపు పిఠాపురం సభపై ఉంటుందన్నారు.

ఈ సభను జయప్రదం చేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. హోలీ పండగ నాడు నిర్వహిస్తున్న ఈ సభను పండగ వాతావరణంలో జరుపుకొందామని నాదెండ్ల పిలుపు నిచ్చారు. సభ నిర్వహణ కోసం వేసిన 14 కమిటీలు... సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.

ఆవిర్భావ సభ నిర్వహణ కోసం నియమించిన కమిటీలతో శనివారం కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ కార్...