భారతదేశం, మార్చి 5 -- Nadendla Manohar: కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి నాదెండ్ల మనోహర్ ఖండించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన వైఎస్ జగన్ పై మండిపడ్డారు.

"శాసనసభ నిబంధనలు తెలియకుండా వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయడం హాస్యాస్పదం. కనీసం ఇంగిత జ్ఞానంలేకుండా మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధంగా, నోటికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి జగన్ చేసి విమర్శలు మాకు చాలా బాధ కలిగించాయి. మన స్థానాన్ని నిర్ణయించేది ప్రజలు. వైనాట్ 175 అని ఎగిరినటువంటి వ్యక్తి జగన్.

ఇప్పుడు 11 స్థానాలకు పరిమితమైన మతిస్థితిమితం కోల్పోయారు. ఆ రోజు పవన్ కల్యాణ్ మాట్లాడిన విషయంపై అవగాహన...