భారతదేశం, ఏప్రిల్ 9 -- Nadendla Manohar : దిల్లీలోని ఏపీ భవన్ లోని పౌరసరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ ,ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ బియ్యం నాణ్యతను పరిశీలించారు. బియ్యం బస్తా తూకంలో తేడా రావడంతో సిబ్బందిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పౌర సరఫరాల శాఖ పేరుతో ఇక్కడ బియ్యం షాపు నడిపిస్తున్నారని సీరియస్ అయ్యారు. వెంటనే ఈ షాపును సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ అమ్మే బియ్యంలో నాణ్యత లేదని, 26 కేజీల బియ్యం బస్తా 25 కేజీలు మాత్రమే ఉందన్నారు. వేయింగ్ మిషన్ సైతం సరిగా పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

26 కేజీల బియ్యం బస్తాను మంత్రి నాదెండ్ల మనోహర్ చెక్ చేయగా... బియ్యంలో నూకల శాతం ఎక్కువగా ఉండడం గమనించారు. కాకినాడకు...