భారతదేశం, ఫిబ్రవరి 27 -- టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కన్ను భారత యువ టెన్నిస్ సంచలనంపై పడింది. లెజెండరీ టెన్నిస్ ప్లేయర్ ఫోకస్ లో పడ్డ 15 ఏళ్ల ఆ అమ్మాయి పేరు మాయ రాజేశ్వరణ్ రేవతి. కోయంబత్తూర్ కు చెందిన మాయ తన అసాధారణ నైపుణ్యాలతో అదరగొడుతోంది. స్పెయిన్ లోని మల్లోర్కాలో ఉన్న నాదల్ అకాడమీలో ఏడాది పాటు శిక్షణ పొందే ఛాన్స్ పట్టేసింది.

15 ఏళ్లకే మాయ రాజేశ్వరణ్ దిగ్గజం నాదల్ సమక్షంలో ట్రెయినింగ్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. 100 పర్సెంట్ స్కాలర్షిప్ తో ఈ రఫెల్ నాదల్ అకాడమీలో ఆమె ప్రాక్టీస్ సాగుతోంది. ఈ సందర్భంగా మాయ ప్రాక్టీస్ సెషన్ కు నాదల్ హాజరయ్యాడు. ఆమె ఆడుతుంటే తీక్షణంగా చూశాడు. ఆ సమయంలో క్లిక్ మనిపించిన ఫొటో సోషల్ మీడియాాలో వైరల్ గా మారింది. మాయ తన టాలెంట్ తో నాదల్ ను ఆకట్టుకుంటుందనే కామెంట్లు వస్తున్నాయి.

మాయ ప్రాక్టీస్ ను నాదల్ చూస...