భారతదేశం, ఫిబ్రవరి 17 -- Naari Movie: సీనియ‌ర్ హీరోయిన్‌ ఆమని ప్ర‌ధాన పాత్ర‌లో నారి పేరుతో ఓ మూవీ తెర‌కెక్కుతోంది. లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ మూవీలో వికాస్ వశిష్ట, మౌనిక రెడ్డి, కార్తికేయ దేవ్, ప్రగతి ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీకి సూర్య వంటిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

నారి మూవీ నుంచి నిషిలో శ‌శిలా అనే పాట‌ను రిలీజ్ చేశారు. ఈ పాట‌ను ఫేమ‌స్ సింగ‌ర్ చిన్మ‌యి శ్రీపాద ఆల‌పించారు. ప్ర‌సాద్ సానా సాహిత్యం అందించారు. వినోద్ కుమార్ విన్ను మ్యూజిక్ అందించాడు.ఈ పాట యూట్యూబ్‌లో మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకుంటోంది. స్త్రీ గొప్ప‌త‌నాన్ని చాటిచెబుతూ లిరిక్స్ సాగాయి. చిన్మ‌యి శ్రీపాద వాయిస్ ఈ పాట‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది.

ఓ విద్యార్థిని తన టీచర్‌తో అమ్మాయిలు ఈ సమాజంలో ఎదుర్కొనే కష్టాలు, సమస్యల గురించి చెబుతూ ఇటీవ...