భారతదేశం, ఫిబ్రవరి 10 -- NAAC Bribes Case: నాక్‌ గ్రేడింగ్‌ వ్యవహారంలో సీబీఐ కేసులు నమోదు చేయడం కలకలం రేపుతోంది. ఉన్న‌త విద్యా సంస్థ‌ల‌కు ఇచ్చే నేష‌న‌ల్‌ అసెస్‌మెంట్ అండ్‌ అక్రిడిటేషన్ కౌన్సిల్ (ఎన్ఎఎసి) గ్రేడ్‌లు ఇచ్చేందుకు ముడుపులు తీసుకోవ‌డం వెలుగులోకి వ‌చ్చింది. జేఎన్‌యూ ప్రొఫెస‌ర్, నాక్ క‌మిటీ స‌భ్యుడు రాజీవ్ సిజారియా కేఎల్ యూనివ‌ర్శిటీకు నాక్ త‌నిఖీ నివేదిక‌ను తారుమారు చేయ‌డానికి త‌న నివాసంలో లంచం కోసం చ‌ర్చ‌లు జ‌రిపారు.

మెరుగైన ర్యాంకింగ్‌ ఇవ్వ‌డానికి నాక్ బృందం సభ్యులు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులోని కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (కెఎల్ఈఎఫ్‌) నుండి రూ.1.8 కోట్లు డిమాండ్ చేశారు. చర్చల తరువాత‌, రూ.28 లక్షలకు ఒప్పందం ముగిసింది. ఇందులో ప్రొఫెస‌ర్ రాజీవ్ సిజారియా ప్రధాన వాటాను సొంతం చేసుకున్నాడు.

2018లో కేఎల్ యూనివర్శిటీ నాక్ ఏ+...