Hyderabad, ఫిబ్రవరి 14 -- Director Ajay Bhupathi Launch Na Love Story First Look: మహీర క్రియేషన్స్, సుప్రియ ఆర్ట్స్ బ్యానర్లపై దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా నా లవ్ స్టోరీ. తెలుగులో రొమాంటిక్ అండ్ లవ్ స్టోరీ చిత్రంగా తెరకెక్కిన నా లవ్ స్టోరీ సినిమాకు వినయ్ గోను దర్శకత్వం వహిస్తున్నారు. నా లవ్ స్టోరీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అజయ్ భూపతి లాంచ్ చేశారు.

తెలుగులో ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. మంగళవారం సినిమాకు పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ సైతం వరించాయి. అయితే, నా లవ్ స్టోరీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా అజయ్ భూపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

అజయ్ భూపతి మాట్లాడుతూ.. "ఈ చిత్ర దర్శకుడు వినయ్ గోను, నేను ఆర్జీవీ గారి దగ్...