భారతదేశం, ఫిబ్రవరి 5 -- ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మైథ‌లాజిక‌ల్ సినిమాల ట్రెండ్ న‌డుస్తోంది. పురాణాలు, ఇతిహాస గాథ‌ల‌ను సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి తీసుకొచ్చేందుకు ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తోన్నారు. ఈ పౌరాణిక క‌థ‌ల్లో న‌టించేందుకు స్టార్ హీరోలు ఆస‌క్తిని చూపుతోన్నారు.

తాజాగా మ‌హిషాసుర మ‌ర్ధిని కాన్సెప్ట్‌తో తెలుగులో క‌ర్మ‌స్థ‌లం పేరుతో ఓ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమా ద్వారా హీరోయిన్ అర్చ‌న కొంత గ్యాప్ త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీకి రాకీ షెర్మన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. క‌ర్మ‌స్థ‌లం మూవీలో అర్చన తో పాటు మిథాలి చౌహాన్, వినోద్ అల్వా, కాలకేయ ప్రభాకర్, బ‌లగం సంజయ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఈ పాన్ ఇండియ‌న్ మూవీని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. క‌ర్మ‌స్థ‌లం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ బ్యాక్ గ్రౌండ్‌లో అమ్మవారి షాడో కనిపిస...