భారతదేశం, ఫిబ్రవరి 5 -- 'దేవకీ నందన వాసుదేవ' చిత్రానికి రిలీజ్‍కు ముందు మంచి బజ్ వచ్చింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా నటించిన ఈ మూవీ గతేడాది నవంబర్ 22వ తేదీన థియేటర్లలో రిలీజైంది. హనుమాన్ సినిమాతో బ్లాక్‍బస్టర్ సాధించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి స్టోరీ అందించడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ మైథలాజికల్ టచ్‍తో ఈ యాక్షన్ డ్రామా మూవీ రూపొందడంతో ఆసక్తి పెరిగింది. అయితే ఈ దేవకీ నందన వాసుదేవ చిత్రం థియేటర్లలో నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

దేవకీ నందన వాసుదేవ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులోకి వస్తోంది. కానీ తెలుగులో కాకుండా ముందుగా హిందీ డబ్బింగ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. హిందీలో టీవీ ఛానెల్‍లోనూ ప్రసారం కానుంది.

దేవకీ నందన వాసుదేవ హిందీ డబ్బింగ్ వెర్షన్ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీట...