భారతదేశం, ఫిబ్రవరి 28 -- సుడల్: ది వర్టెక్స్' తమిళ వెబ్ సిరీస్‍కు రెండో సీజన్ కోసం చాలా కాలంగా చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూశారు. ఈ సిరీస్ తొలి సీజన్ ట్విస్టులు, గ్రిప్పింగ్ నరేషన్‍తో అంతలా ఆకట్టుకుంది. ఉత్కంఠతో ఊపేసింది. పుష్కర్ - గాయత్రి దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ తొలి సీజన్ 2022 జూన్‍లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రాగా.. భారీ సక్సెస్ అయింది. నేషనల్ వైడ్‍లో పాపులర్ అయింది. దీంతో రెండో సీజన్ కోసం నిరీక్షణ బాగా కొనసాగింది. మోస్ట్ అవైటెడ్ సిరీస్‍ల్లో ఒకటిగా నిలిచింది. ఎట్టకేలకు సుడల్ 2 సిరీస్ నేడు (ఫిబ్రవరి 28) స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.

సుడల్ సీజన్ 2 నేడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల వచ్చిన ట్రైలర్ ఉత్కంఠభరితంగా సాగడంతో రెండో సీజన్‍పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సీజన...