Hyderabad, ఫిబ్రవరి 4 -- MX Player New Movies Web Series: ఎంఎక్స్ ప్లేయర్ (MX Player) ఓటీటీ తెలుసా? ఈ మధ్యే అమెజాన్ కొనుగోలు చేసింది. ఇందులోని కంటెంట్ మొత్తం ఎవరైనా ఫ్రీగా చూడొచ్చు. అలాంటి ఓటీటీ 2025లో తమ ప్లాట్‌ఫామ్ లోకి రాబోతున్న కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ వివరాలు వెల్లడించింది. ఏకంగా ఒకే ఏడాది 100కుపైగా సినిమాలు, వెబ్ సిరీస్ రానున్నాయి.

ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీ చాలా రోజులుగా ఉన్నా చాలా మందికి పెద్దగా తెలియదు. అయితే ఈమధ్య అమెజాన్ ఈ ఓటీటీని కొనుగోలు చేసిన తన మినీటీవీతో కలిపేసింది. అప్పటి నుంచీ ఈ ఓటీటీ దూకుడు మరింత పెరిగింది.

తాజాగా ప్రకటించిన కొత్త కంటెంట్ లో పాపులర్ వెబ్ సిరీస్ ఆశ్రమ్ సీజన్ 3 పార్ట్ 2తోపాటు హంటర్ సీజన్ 2, హాఫ్ సీఏ సీజన్ 2, సిక్సర్ వెబ్ సిరీస్ సీజన్ 2, హు ఈజ్ యువర్ గైనా సీక్వెల్ లాంటివి ఉన్నాయి.

క్రైమ్, క్రైమ్ థ్రిల్లర్...