భారతదేశం, ఫిబ్రవరి 17 -- భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్, సిప్‌లలో చాలా మంది పెట్టుబడి పెడుతున్నారు. చిన్న పెట్టుబడిదారులలోనే కాకుండా పెద్ద పెట్టుబడిదారులలో కూడా ముఖ్యమైన పెట్టుబడి ఆప్షన్స్‌గా ఇవి మారాయి. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. సిప్ ద్వారా పెట్టుబడిదారులు చిన్న మొత్తంతో ప్రారంభించే అవకాశం పొందుతారు. ఇది దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇస్తుంది. సిప్‌లో మార్కెట్ పెరిగినా లేదా పడిపోయినా దీర్ఘకాలంలో మంచి రాబడి వస్తుందనే నమ్మకంతో ఉంటారు చాలా మంది.

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. మ్యూచువల్ ఫండ్లు దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇవ్వగలవని పెట్టుబడిదారులు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, మొబైల్ యాప్‌ల ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ఇప్పుడు...